• లక్కీని అభినందించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు
  • రూ.3 వేలతో పాటు బహుమతిని అందుకున్న విద్యార్థిని

వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి మండలకేంద్రంలోని మోడల్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న హింగే లక్కీ అనే విద్యార్థినికి ఉపన్యాస పోటీల్లో హనుమకొండ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చినట్లు ప్రిన్సిపాల్ భయ్యా సునీత తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ వైద్య దినోత్సవం 2023 పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో ‘‘మానవ జీవన విధానంలో ప్రకృతి పాత్ర’’ అనే అంశంపై పాఠశాలలో మండలస్థాయి, జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు.

ఈ పోటీల్లో సూరారం గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని హింగే లక్కీకి ప్రథమ బహుమతి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఆమెకు రూ.3 వేలు, బహుమతితో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందినట్లు స్పష్టం చేశారు. విద్యార్థినికి బహుమతిని ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పరకాల శ్రీనివాస్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

తమ పాఠశాల విద్యార్థిని లక్కీకి బహుమతి రావడం పట్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీత, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. లక్కీని అభినందించారు. సూరారం గ్రామస్తులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థిని లక్కీ చదువుల్లో మరింతగా రాణించి భవిష్యత్ లో మరింత ఉన్నత స్థానానాకి చేరుకోవాలని ఆకాంక్షించారు. తన కూతురికి జిల్లాస్థాయి ప్రథమ బహుమతి రావడం పట్ల తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షులు, ఆరెకుల సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హింగె భాస్కర్ ఆనందం వ్యక్తం చేశారు.