•  వివాద రహితుడిగా పేరున్న వ్యక్తి
  •  శేష జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలి
  • హన్మకొండ న్యాయశాఖ ఉద్యోగులు, ప్రతినిధులు
  •  ఘనంగా జూ.అసిస్టెంట్ నరేందర్ పదవీ విరమణ వేడుక

వేద న్యూస్, హన్మకొండ: 

హన్మకొండ న్యాయశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా సుదీర్ఘ కాలం సేవలందించిన ఊషకోయల నరేందర్ బుధవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హన్మకొండ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు వేడుకను నిర్వహించారు.

తమ విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తూ అందరి మన్ననలు పొందిన నరేందర్ ను సహోద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ వేడుకలో నరేందర్ కుటుంబసభ్యలు కూడా పాల్గొన్నారు.

న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. నరేందర్ అందించిన సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో ఎలాంటి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా, బాధ్యతాయుతంగా పని చేసిన ఉద్యోగిగా నరేందర్ గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

ఉద్యోగ జీవితం ముగిసినప్పటికీ, భవిష్యత్ జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా సాగాలని పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సమాజానికి సేవలందించే కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.

వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని సహోద్యోగులు, సంఘ సభ్యులు మనసారా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వేడుకలో నరేందర్ మాట్లాడుతూ.. తాను ఉద్యోగ నిర్వహణలో ఎప్పుడూ రాజీ పడలేదన్నారు. తన సహోద్యోగులు, పై అధికారుల సహకారం ఎంతో ఉందన్నారు. తనకు ఇన్నేళ్లు విధి నిర్వహణలో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

 

తన కుటుంబ సభ్యుల సహకారం కూడా తనకు ఎల్లప్పుడూ ఉందని ఈ సందర్భంగా నరేందర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయశాఖకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొని నరేందర్ కు ఘనంగా వీడ్కోలు పలికారు.