- జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ చేతుల మీదుగా..
- న్యూ ఇయర్ సంక్రాంతి ధమాకా సేల్ లో.. భాగంగా ప్రతి వస్తువుకు డిస్కౌంట్
వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త..జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లి సర్కిల్ లో శనివారం న్యూ బిగ్ మార్ట్ ఘనంగా ప్రారంభమైంది. జమ్మికుంట పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎస్. రామకృష్ణ, కోరపల్లి సర్పంచ్ కందికట్ల మధుసూదన్, ఉప సర్పంచ్ రాజు బిగ్ మార్ట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
జమ్మికుంట పట్టణ సీఐ రిబ్బన్ కట్ చేసి న్యూ బిగ్ మార్ట్ ను ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి.. షాపును కలియతిరిగి పరిశీలించారు.
న్యూ ఇయర్ సంక్రాంతి ధమాకా సేల్ లో భాగంగా ప్రతి వస్తువుపై ఖచ్చితమైన డిస్కౌంట్ ను వినియోగదారులకు ఇవ్వనున్నట్లు న్యూ బిగ్ మార్ట్ నిర్వాహకులు కొండి రమేష్, కొండి శ్రీధర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు.. సి ఐ రామకృష్ణ గౌడ్ ను శాలువా తో ఘనంగా సన్మానించి.. సర్కిల్ ఇన్ స్పెక్టర్ కి గిఫ్ట్ అందజేశారు. జమ్మికుంట పట్టణంలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో వినియోగదారులకు ఫ్రీ డెలివరీ ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.
షాపింగ్ రంగంలో 20 ఏళ్ల విశేష అనుభవం కలిగిన కొండి రమేష్, కొండి శ్రీధర్ ..లు న్యూ బిగ్ మార్ట్ సేవలతో ప్రజలకు మరింత దగ్గరై వృద్ధిలోకి రావాలని ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులు ఆకాంక్షించారు.



