- చింతలపల్లిలో బీజేపీ నేతల ఇంటింటి ప్రచారం
వేద న్యూస్, ఎల్కతుర్తి:
కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి కోరారు. సోమవారం ఆయన బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మ శ్రీరాం చక్రవర్తిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని జనాన్ని కోరారు.
గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేయబోతుందని చెప్పారు. బీజేపీ అభ్యర్థి శ్రీరామ్ చక్రవర్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో బెల్ట్ షాపులను బంద్ చేపిస్తారని, మహిళల శ్రేయస్సు కోసం తమ పార్టీ కృషి చేస్తోందని వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అడెపు శ్రివర్థన్, జనగాని కిష్టయ్య, పల్లేపాటి మధుకర్, అరేపల్లి వినోద్, చదిరం రాకేష్, మహిళా మొర్చా మండల అధ్యక్షురాలు స్వాతి, కుడుతాడి కరుణాకర్, కుడుతాడి రాజు, ఇరువాల మోహన్ రావు, అనిత, రజినీ, కవిత, మమత తదితరులు పాల్గొన్నారు.