- ఆ పార్టీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్
వేద న్యూస్ , మంచిర్యాల :
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంచిర్యాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెళ్లి రఘునాథ్ అన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణం చున్నంబట్టి వాడ, సాయికుంటలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ, కేవలం బీజేపీ పార్టీతోనే సుపరి పాలన సాధ్యం అని, బీజేపీ ప్రకటించిన మానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందేలా రూపొందించడం జరిగిందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని అన్నారు. అనంతరం హజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో వెరబెల్లి స్రవంతి ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, అభివృద్ది కొరకు బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.