వేద న్యూస్, మందమర్రి:

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి, గెలిపిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని బిజెపి చెన్నూరు అభ్యర్థి దుర్గం అశోక్ తెలిపారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని వెంకటాపూర్ గుడిపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలో ఎవరికి ఓటు వేసిన పేద ప్రజలకు అందుబాటులో ఉండారని ఆరోపించారు.

ఇన్ని రోజులు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే బాల్క సుమన్ తోని ఉన్నవారే మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని, పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్లీ అదే నాయకుల పెత్తనం ఉంటుందన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేస్తే కొంత మంది లీడర్లు మాత్రమే బతుకుతారని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కొరకు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అదేవిధంగా పట్టణంలోని పలు వార్డులలో బిజెపి శ్రేణులు బిజెపి అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.