- కాంగ్రెస్ పార్టీ నేతల ధీమా
వేద న్యూస్, ఎల్కతుర్తి:
హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం యూత్ కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు హింగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల కరపత్రాలను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి వస్తే నెరవేర్చే హామీల గురించి జనానికి అర్థమయ్యేలా వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవకారి కృష్ణుడు, బాలకిషన్, వాంకె రవీందర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.