వేద న్యూస్, పెద్దపల్లి/ఎలిగేడు:
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన హమాలీ, గౌడ సంఘ సభ్యులు, గౌడ సంఘం అధ్యక్షులు బత్తిని ఎల్లయ్య, శ్రీపతి కుమార్, మాజీ వార్డు మెంబర్ బండారి ఐలయ్య, కొత్త హమాలీ సంఘం కోసున లక్ష్మణ్, సర్వ కుమార్, సర్వ సతీష్, కోసనవేణు, బండారి శ్రీను తదితరులు గులాబీ గూటికి చేరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

వారందరికీ దాసరి గులాబీ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతోందని మనోహర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం ఖాయం అని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, జడ్పీటీసీ గంట రాములు, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు, మార్కెట్ వైస్ ఛైర్మెన్ ఐరెడ్డి వెంకట్ రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మెన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ఆళ్ల రాజిరెడ్డి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.