- పార్టీ మార్పు వార్తలను ఖండించిన టీమ్ సభ్యులు
వేద న్యూస్, హుస్నాబాద్:
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వృక్ష ప్రసాదదాత జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి(జేఎస్ఆర్) అనుచరులు ‘టీమ్ జేఎస్అర్’ సభ్యులు పార్టీ మారారంటూ వస్తున్న వార్తలను వారు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ ‘టీమ్ జేఎస్అర్’ నియోజకవర్గంలో పేద వారికి సహాయం కోసం పార్టీలకు కుల, మతాలకు అతీతంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.జేఎస్ఆర్ ఆలోచన విధానం, వారి సేవా గుణం చూసి నియోజకవర్గవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి వేల మంది సభ్యులుగా ఉన్నారని వివరించారు. ఒకరిద్దరు ఇతర పార్టీలో చేరితే వచ్చే నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. అది చూసి ఇతర పార్టీలు జేఎస్ఆర్ అనుచరులు పార్టీ మారుతున్నారని తప్పుడు వదంతులు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘టీమ్ జేఎస్అర్’ ద్వారా నియోజకవర్గంలో పార్టీలతో, ఎన్నికలతో సంబంధం లేకుండా నిరంతరం సేవ కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు. కష్టాల్లో వున్న పేద ప్రజలను ఆదుకోవడమే టీమ్ జేఎస్అర్ కర్తవ్యం అని పేర్కొన్నారు.