వేద న్యూస్, జడ్చర్ల:

బీఆర్ఎస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సి.లక్ష్మారెడ్డికి మద్దతుగా మైమాన్ కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో గురువారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించినట్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చల శ్రీనివాస్ తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.బిఆర్ఎస్ మ్యాని పేస్టో ను ప్రజలకు వివరించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ దానిష్ అలీ, మైనార్టీ ఫ్రెండ్ జిల్లా అధ్యక్షులు హఫీజ్ వుర్ రెహమాన్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు హబీబ్, ప్రజాప్రతినిధులు వార్డు ఇన్చార్జీ,కాలనీవాసులు,బి ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.