వేద న్యూస్ పాపన్నపేట
మండల కేంద్రమైన పాపన్నపేటకు చెందిన గ్రామ పద్మశాలి కులస్టుడు
వళ్ళందేశి కృష్ణ మంగళవారం రోజు
అకాల మరణం చెందగా,ఆయన అంత్యక్రియలు బుధవారం రోజు నిర్వహించారు. నిరుపేద కుటుంబానికి చెందిన క్రిష్ణ కుటుంబ సభ్యులకు ఆయన అంత్యక్రియల నిమిత్తం పాపన్నపేట చేనేత సహకార సంఘం,
పాపన్నపేట పద్మశాలి కులదైవం
తరుపున రూ.5000/- రూపాయలు ఆర్థిక అందజేశారు.ఈ కార్యక్రమంలో పాపన్నపేట చేనేత సహకార సంఘం చైర్మన్ కొడపాక విట్టల్, ఉపాధ్యక్షులు పల్లె సంగమేశ్వర,డైరెక్టర్లు గురునాధం,పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు వళ్లందేశీ శ్రీనివాస్,నాయకులు కొడపాక శివశంకర్,బద్ద పురం సంగమేశ్వర, తూర్పునాగేశ్వర,పడిగే కిష్టయ్య,కల్లేటి యుగంధర్,తదితరులు పాల్గొన్నారు.
