*మత్స్యశాఖ దినోత్సవం సందర్భంగా పాపన్నపేటలో ఘనంగా జెండావిష్కరణ*

వేద న్యూస్, పాపన్నపేట

మత్స్యశాఖ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాపన్నపేట మండల కేంద్రంలో శనివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాపన్నపేట బస్టాండ్ సమీపంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ముషెట్టి కిష్టయ్య జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యశాఖ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాపన్నపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐక్యతతోనే సామాజికంగా, రాజకీయంగా మరింత అభివృద్ధి సాధించడంతో పాటు రాజకీయ రంగంలోనూ ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముదిరాజ్ సంఘం సభ్యులందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాపన్నపేట గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బుడాల మానయ్య, వెంకటేశం, విట్టల్, లక్ష్మణ్, తోట్ల నరేష్, ఆంజనేయులు, భాగయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *