*మత్స్యశాఖ దినోత్సవం సందర్భంగా ముద్దాపూర్ గ్రామంలో  ఘనంగా జెండావిష్కరణ 

ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు  యు. ఆంజనేయులు

వేద న్యూస్, పాపన్నపేట

మత్స్యశాఖ దినోత్సవాన్ని పురస్కరించుకొని  మండల కేంద్రమైన ముద్దాపూర్ గ్రామంలో శనివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముద్దాపూర్  స్కూల్ సమీపంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు  యు. ఆంజనేయులు జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యశాఖ దినోత్సవాన్ని పురస్కరించుకొని  ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐక్యతతోనే సామాజికంగా, రాజకీయంగా మరింత అభివృద్ధి సాధించడంతో పాటు రాజకీయ రంగంలోనూ ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముదిరాజ్ సంఘం సభ్యులందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో  అధ్యక్షులు యు. ఆంజనేయులు, ఉపాధ్యక్షులు పి. బాలరాజు గ్రామ ప్రజలు ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొనారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *