వేద న్యూస్ , రాజాపూర్:
ఈ నెల 30న జరిగే శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సి.లక్ష్మారెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఆదివారం రాజాపూర్ మండల కేంద్రంలోని పలు కాలనీలలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి డమ్మీ ఈవీఎం లో కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. జడ్చర్ల నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లె తిరుపతయ్య,డిప్యూటీ సర్పంచ్ శ్రీనివాస్,మండల ఉపాధ్యక్షులు రాచమల్ల యాదగిరి,వార్డ్ సభ్యులు దస్తగిరి,నాయకులు లింగం, హరీష్ రెడ్డి,బైండ్ల నరసింహ, ఎం యాదగిరి,రాఘవులు, తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
