వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్ట గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ లో చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కురుమ సంఘం నుంచి నాయకులు గులాబీ గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు మాట్లాడుతూ దాసరి మనోహర్ రెడ్డి చేసిన అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజులో పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని చెప్పారు. పార్టీలో చేరిన వారికి దాసరి ప్రశాంత్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జెడ్పిటిసి మండిగా రేణుక రాజనర్సు, ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రామ్ రెడ్డి, శ్రీనివాస్, మహేశ్వరరావు, అనిల్, ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.