వేద న్యూస్, వరంగల్ క్రైమ్:

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలకు అనుమతులు లేవని వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం ఒక ప్రకటన చేశారు. నేడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబందించి ఫలితాలు వెలుబడుతున్న వేళ ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ ఆమలులో ఉన్నందున ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలను నిర్వహించుకోరాదని పేర్కొన్నారు.

 

అలానే బాణా సంచా కాల్చడం, డిజే వినియోగం, ద్విచక్ర వాహన ర్యాలీలు, ఇతర ర్యాలీలతో పాటు, సంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, గుంపులు తిరగడం నిషేదించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలతో పాటు ఓటమి పాలైన పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం సమన్వయంతో వ్యవహరిస్తూ పోలీసులకు పూర్తి సహకారాన్ని అందించాలిసిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. ఎవరైనా పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.