- ఎమ్మెల్యేగా గెలిచి పొలిటికల్ గేమ్ చేంజర్ గా నిలిచిన యువనేత
- జనంలో ఉన్న నాయకుడిగా గెలుపు గురించి ముందే చెప్పిన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:
హుజురా‘బాద్ షా’గా యువనేత, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి గెలిచారు. రసవత్తరంగా జరిగిన అసెంబ్లీ పోరులో కౌశిక్ రెడ్డి విజయం సాధించారు.తన సమీప ప్రత్యర్థి సీనియర్ నేత ఈటల రాజేందర్ పై భారీ మెజారిటీతో పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించారు. తన విజయాన్ని తన నాన్న, కేసీఆర్ కు అంకితం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మీడియాతో పాడి మాట్లాడుతూ తన జీవితం హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు అంకితం అని చెప్పారు.
తాను 2018లోనే గెలవాల్సిందని, కానీ, చిన్న మిస్టేక్ వల్ల గెలవలేదని స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తాను జనంలోనే ఉన్నానని పీకేఆర్(పాడి కౌశిక్ రెడ్డి) వెల్లడించారు. కాగా, పాడి కౌశిక్ రెడ్డి గెలుపుపై ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక ముందే అంచనా వేసింది. ‘జనంలో పీకేఆర్’ శీర్షికన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక ప్రచురించిన కథనం అక్షరాల నిజమైంది. ఓటమెరగని సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ ను యువనేత పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ పోరులో ఓడించారు.