vodithala pranav
  • నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని హామీ
  • కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వెల్లడి
  • నాయకులు, కార్యకర్తలు ఎవరూ బాధపడొద్దు, అదైర్య పడొద్దని సూచన
  • నిరంతరం పార్టీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన యువనేత

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:
హుజురాబాద్ నియోజకవర్గానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వీరామంగా పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించిన ఓటర్ మహాశయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ తెలిపారు. ఆదివారం ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

 

ఒక సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తనకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇవ్వగా ఓట్లు వేసి ఆశీర్వదించిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ప్రణవ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పాటుపడిన కార్యకర్తలకు నాయకులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. కార్యకర్తలు, నాయకులు అధైర్య పడవద్దని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను నియోజకవర్గంలోని ప్రతీ గడపకు అందజేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.