• పోటాపోటీ పోరులో నెగ్గిన కాంగ్రెస్ నేత

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట:
నర్సంపేట పోటాపోటీలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి నెగ్గారు. ద్విముఖంగా సాగిన రసవత్తర పోరులో చివరకు హస్తం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి , బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి పై గెలుపొందారు. ఆదివారం ఫలితాలు వెలువరించిన అనంతరం అధికారులు నర్సంపేట ఎమ్మెల్యేగా దొంతి మాధవరెడ్డి గెలిచినట్లు ధ్రువీకరణ పత్రం అందించారు.