వేద న్యూస్, హుజురాబాద్:
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోమవారం కలిశారు. హుజురాబాద్ శాసన సభ్యుడిగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి..తన ఎమ్మెల్యే ధ్రువీకరణ పత్రాన్ని కేసీఆర్ కు గిఫ్ట్ గా అందజేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి, ఆయన సతీమణి పాడి శాలిని రెడ్డి, కూతురు శ్రీనిక రెడ్డి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.