వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలో ఎన్ సి సి పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ మినరల్స్ ఇయర్ 2023-24’ ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి హెచ్ రావు గురువారం తెలిపారు. ప్రపంచంలో నేడు మిల్లెట్స్ (మినరల్స్) ప్రాధాన్యత గుర్తించిన ప్రపంచ దేశాలు 2023- 24 సంవత్సరాన్ని ‘‘అంతర్జాతీయ మినరల్స్ డే’’గా నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

 

విద్యార్థులలో సృజనాత్మక శక్తిని, ఆరోగ్య సూత్రాలు భవిష్యత్ తరాలకు కావలసిన ఆహార అలవాట్లు మన పూర్వీకులు అందించిన మిల్లెట్స్..వాటి ప్రాధాన్యత, వాటి శక్తి సామర్థ్యాల గురించి..విద్యార్థులు వారి సృజనాత్మక శక్తిని ఫొటో గ్యాలరీలో చాలా చక్కగా చిత్రీకరించారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థుల్లో చైతన్య నింపినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు.

కార్యక్రమంలో కెప్టెన్ డాక్టర్ ఎం సదానందం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే రాజేందర్ రెడ్డి, అధ్యాపకులు సిహెచ్ రవీందర్, వి మధుకర్ రావు, డాక్టర్ రాఘవేందర్ రెడ్డి, అఫ్జల్, శ్రీనివాస్ , రాము జూనియర్ అండ్ ఆఫీసర్, విద్య, రజినీకాంత్, భాగ్యలక్ష్మి, హాస్య, శివాని, నాగరాజు, నౌషీన్, రేణుక , సంతోష్, ప్రదీప్ కుమార్ మొదలగు క్యాడేట్స్ పాల్గొన్నారు చిత్రలేఖనంలో మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు ప్రకటించారు. ఈ కార్యక్రమం ఈ నెల 9 నుండి 14 వరకు చైతన్య ర్యాలీలు, ప్రత్యేక ఉపన్యాసాలు, చిత్రలేఖనం, వ్యాసరచన, వంటలు చేయడం మొదలగు కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.