వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
పంచాయతీ రాజ్,శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క బాధ్యతలు స్వీకరించారు. గురువారం హైదరాబాద్ సెక్రటేరియట్ లో మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడారు. తన ప్రతీ అడుగు అభివృద్ధి వైపు ఉంటుందని చెప్పారు.

తనను ఆదరించి ఆశీర్వదించిన ములుగు ప్రజలకు రుణపడి ఉంటానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ లు 100 రోజుల్లో అమలు చేస్తామని, సమ్మక్క సారలమ్మ దీవెనలతో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. తనను ఆదరించి అక్కున చేర్చుకొని ఆశీర్వదించిన ములుగు ప్రజలకు సేవ చేస్తానని సీతక్క పేర్కొన్నారు.