- కేరళ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు
- భక్తులకు మౌలిక వసతుల్లేవని ఆరోపణ
- పెద్ద సంఖ్యలో భక్తుల రావడంతో రద్దీ ఏర్పడిందని పినరయి ప్రభుత్వ వివరణ
వేద న్యూస్, డెస్క్:
కేరళ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తుల తాకిడి పెరిగింది. కాగా, పవిత్రక్షేత్రంలో మౌలిక వసతులు కల్పించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేరళలోని వామపక్ష సర్కార్ పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి.
ప్రభుత్వం మౌలికవసతుల ఏర్పాటుపై దృష్టిపెట్టలేదని, దాంతో అయ్యప్ప దర్శనం కాకుండానే కొందరు తిరిగెళ్తున్నారని విపక్షాలు, భక్తులు కొందరు ఆరోపిస్తున్నారు. కాగా, భక్తుల రాక పెరగడంతో భారీగా రద్దీ పెరిగిందని, ఈ సమస్యను కావాలనే విపక్షాలు పెద్దగా చేస్తున్నాయని పినరయి ప్రభుత్వం వివరణ ఇస్తోంది.
