వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలో ఎన్సిసి పదో తెలంగాణ బెటాలియన్ ఆర్మీ విభాగం ఆధ్వర్యంలో ‘విజయ్ దివాస్’ ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డిహెచ్ రావు శనివారం తెలిపారు. 1971 డిసెంబర్ 16న ప్రపంచంలోనే అత్యంత ఘన విజయం సాధించిన ఆర్మీగా విజయ్ దివాస్ ను ఆనాటి భారత ఆర్మీ ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. 93 వేల మంది పాకిస్తాన్ సైనికులను ప్రాణాలతో లొంగిపోవడం ప్రపంచంలో ఏ యుద్ధంలో కూడా ఇంతమంది శత్రు సైనికులను ప్రాణాలతో బంధించిన సైన్యం ఒక భారతదేశమే అని పేర్కొన్నారు.

పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విముక్తి చేసి భీకరమైన యుద్ధంలో పాకిస్తాన్ కుట్రలను ఇండియన్ ఎయిర్ఫోర్స్,, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా 13 రోజుల్లోనే ఈ యుద్ధాన్ని సంపూర్ణంగా పూర్తి చేశారని గుర్తుచేశారు. ఈ యుద్ధ ఫలితం బంగ్లాదేశ్ విముక్తి జరిగిందని భారత చెరువుతో పాకిస్తాన్ కుట్రలను భగ్నం చేసి భారత ఆర్మీ శక్తిని ప్రపంచానికి చాటాలని ఆ గొప్ప యుద్ధ విజయాన్ని భారతదేశం విజయ్ దివాసుగా డిసెంబర్ 16న జరుపుకుంటుందని వివరించారు.

భారత సైన్యం శక్తిని నేటి యువత దేశ ప్రజలు గుర్తు చేసుకుని వారి త్యాగం ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఎన్సిసి క్రెడిట్ జాతీయ పతాకంతో సైనికుల విజయాన్ని ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కెప్టెన్ డాక్టర్ ఎం సదానందం, అధ్యాపకులు సిహెచ్ రవీందర్, బి మధుకర్ రావు, ఓం శ్రీ, రాధిక, సంతోషి, సృజన, శృతి, పవన్, శశాంక్, రాము , రజనీకాంత్, విష్ణు, భాగ్యలక్ష్మి, నౌ సిం, విద్య పాల్గొన్నారు.