- ‘శ్రీ రామ సినిమాస్’ ఘన ప్రారంభం
- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే చింతకుంట చేతుల మీదుగా..
- సుల్తానాబాద్‌లో మొట్టమొదటి మల్టీప్లెక్స్ ఇదే..ఓపెనింగ్‌కు భారీగా హాజరైన జనం
వేద న్యూస్, పెద్దపల్లి ప్రతినిధి:
వినోద ప్రియులు, సుల్తానాబాద్‌తో పాటు పరిసర ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. సోమవారం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని గట్టెపల్లి రోడ్లో నూతనంగా నిర్మించిన ‘శ్రీరామ సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్, కామర్స్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు ప్రారంభించారు.
మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి శ్రీధర్ బాబును కాంగ్రెస్ పార్టీ నాయకులు దుగ్యాల సంతోష్ రావు గజమాలతో ఘనంగా సన్మించారు. సుల్తానాబాద్ లో ప్రారంభమైన మొట్ట మొదటి మల్టీప్లెక్స్ ‘శ్రీరామ సినిమాస్’. కాగా, ‘శ్రీరామ సినిమాస్’ ప్రారంభోత్సవానికి వినోద ప్రియులు, స్థానికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.