వేద న్యూస్, హుజురాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర క్యాబినెట్ లో స్థానం సంపాదించుకున్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి, యువనేత వొడితల ప్రణవ్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి పొన్నంకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చం అందించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.