- పాడి పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు
- జమ్మికుంట బొమ్మలగుడి వద్ద బీఆర్ఎస్ నేతల అన్నదానం
- కౌశిక్ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని గులాబీ పార్టీ నాయకుల ఆకాంక్ష
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:
హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలోని బొమ్మల గుడి వద్ద వీణవంక మండలపరిధిలోని కోర్కల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేడుకలు నిర్వహించారు. గులాబీ పార్టీ నేతలు గురువారం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి రానున్న రోజుల్లో మరిన్ని పదవులు పొందాలని ఆశించారు. పాడి కౌశిక్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నామని చెప్పారు.
కౌశిక్ రెడ్డి తోనే హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు కొలిపాక రాకేష్, పూదరి కృష్ణ, ఎల్కపెల్లి శివ, ఈరవేని శ్రీనివాస్, బుడిగె బీరయ్య, మర్రి కుమార్, పూసాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.