వేద న్యూస్, పోచమ్మ మైదాన్:

జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇండియన్‌ మ్యాథమెటికల్‌ జీనియస్‌ శ్రీనివాస రామానుజన్‌ జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. వరంగల్ నగరంలోని దేశాయి పేట కృష్ణవేణి ప్రతిభ పాఠశాలలో శుక్రవారం జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు గణితం కి సంబంధించిన వివిధ వర్కింగ్ మోడల్ ని ప్రదర్శించారు. అనంతరం కృష్ణవేణి ప్రతిభ పాఠశాల ఎం.డి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు గణితం అంటే భయం వదలాలని అన్నారు. గణితాన్ని సులువుగా లాజిక్ తో ఆలోచించి భవిష్యత్తులో మంచి ఇంజనీర్లుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలని అన్నారు.

గణిత శాస్త్రం అభివృద్ధి, మానవాళి పెరుగుదలలో దాని ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కళ్యాణ్ రామ్ ,ఏవో సురేందర్, ఇన్చార్జి కమలాకర్, పిఈటి సందీప్, కృష్ణమోహన్, అరుణ ,తదితర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు