- ఆ బెంచ్ మెంబర్ డాక్టర్ అనితారెడ్డి
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
సీనియర్ సిటిజన్స్‌కు వరం లాంటిది ట్రిబ్యునల్ బెంచ్ అని ఆ ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్ డాక్టర్ అనితారెడ్డి అన్నారు. సీనియర్ సిటిజన్ ఫోరం హన్మకొండ ఆధ్వర్యంలో గురువారం హన్మకొండ నక్కలగుట్టలో ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రమౌళి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని..సీనియర్ సిటిజన్స్ యాక్ట్, ట్రిబ్యునల్ బెంచ్ గురించి అవగాహన కల్పించారు.
అనంతరం 2023 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2024 ఆంగ్ల నూతన సంవత్సరాదికి స్వాగతంగా కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ ఆనందంగా, సరదాగా పాటలు పాడి వినిపించారు. ఆ తర్వాత అనితా రెడ్డి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కు ఏ సమస్యలు వచ్చినా ట్రిబ్యునల్ బెంచ్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ట్రిబ్యునల్ బెంచ్ పట్ల ఇంకా ప్రజల్లో సరైన అవగాహన లేదని చెప్పారు.గ్రామ స్థాయి నుండి నగర స్థాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వృద్ధాప్యము ఎవరికీ శాపంగా మారకూడదని అన్నారు. తమకు ఏ చట్టాలు ఉన్నాయి? అని తెలుసుకుని..తమ హక్కులు ఎలా వినియోగించుకోవాలనే విషయాలతో పాటు సీనియర్ సిటిజన్స్ చట్టం పై డాక్టర్ అనితా రెడ్డి అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో డాక్టర్ అనితా రెడ్డి, డాక్టర్ చంద్రమౌళి, దేవాచారి, ప్రొఫెసర్ విజయలక్ష్మి, సిరాజుద్దిన్,సరళ, గోపాల్ రావు, పి.వి.శ్రీనివాస రావు, సుభాష్ చంద్రబోస్, ఫోరం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.