- ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక కథనానికి స్పందన
- కదిలిన ఎస్సారెస్పీ ఆఫీసర్లు
వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి జిల్లా పరిధిలోని రైతాంగానికి ఎస్సారెస్పీ నీరు జీవనాధారంగా ఉంది. కాగా, ఈ ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీరు జిల్లా పరిధిలోని చివరి మండలాలు ఓదెల, కాల్వ శ్రీరామ్ పూర్ కు అందడం లేదు. ఈ సంగతిని ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ఈ నెల 28న ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించింది. ‘చి‘వరి’కి నీరు అందేనా?’ శీర్షికన ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలాపల్లి గ్రామ పరిధిలోని ఎస్సారెస్పీ డీఏడీ 86 కెనాల్ తూములు సరిగా లేక పోవటం వల్ల నీరు వృథాగా పోతోందన్న విషయాన్ని ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక తన కథనంలో పేర్కొంది. లాలపల్లి గ్రామంలో నీరు వృథాగా పోతోండగా, తాము నీరందక ఇబ్బందులు పడుతున్నామని ఓదెల, కాల్వ శ్రీరామ్ పూర్ మండలాల పరిధి రైతులు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో నీరు వృథాగా పోతుండటం వల్ల పంటలు కూడా దెబ్బతింటున్నాయని రైతులు ‘వేద న్యూస్’ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాలన్నింటినీ ‘వేద న్యూస్’ కథనంగా సమగ్రంగా ప్రచురించగా, గురువారం ఎస్సారెస్పీ అధికారులు కదిలివచ్చారు. సంబంధిత తూముల వద్దకు వెళ్లి రైతులను ఈ విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే తూముకు మరమ్మతులు చేపడతామని పేర్కొన్నారు. డీఈ సిరాజుద్దీన్, ఏఈ శ్రీనివాస్, అయుబ్ అలి, వర్క్ ఇన్ స్పెక్టర్ పరుశరాములు, లస్కర్ అప్రోచ్ తదితరులు తూముల వద్దకు వెళ్లి పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడారు.