• పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట 

వేద న్యూస్, సుల్తానా బాద్:

ఎలిగేడు మండలంలోని సుల్తాన్ పూర్ గ్రామం, సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామంలో కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన” దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు 6 గ్యారంటీల హామీల అమలు పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని అన్నారు.ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆరోగ్య శ్రీ 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంపు, మహిళలందరికి ఉచిత బస్సు ప్రయాణం రెండు హామీలను నెరవేర్చాం అని గుర్తుచేశారు. 

అధికారులంతా ఇది మా ప్రభుత్వం పేదల ప్రభుత్వమనే ఆలోచనతో పనిచేయాలని సూచించారు. రేషన్ కార్డు లేని వారు అభయహస్తం గ్యారంటీ దరఖాస్తతో పాటు రేషన్ కార్డు దరఖాస్తు పత్రాన్ని జత చేసి స్థానికంగా ఉన్న ప్రభుత్వ అధికారులకు ఇవ్వాలని తెలిపారు. ప్రజా పాలనకు వచ్చే ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజల మనసు గెలుచుకోవాలి అని చెప్పారు.

పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న నీరుపేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు అందించేలా కృషి చేస్తానని,పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అద్భుతంగా అభివృద్ధి చేస్తానని చింతకుంట హామీనిచ్చారు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సేవకులుగా మారడానికి నాయకులకు ప్రజా పాలన ఒక మంచి అవకాశం అని వెల్లడించారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అరుణ్, స్థానిక జడ్పీటీసీలు,ఎంపీపీలు సర్పంచులు,ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.