వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షతన హన్మకొండ లోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రయంలో ఆంగ్ల నూతన సంవత్సరాది 2024 సెలబ్రేషన్స్ నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో 2024 సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. డాక్టర్ కె.అనితారెడ్డి..పిల్లల తో కలిసి ఆనందం గా కేక్ ను కట్ చేసి.. సంబురాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ రాబోయే కొత్త సంవత్సరం 2024 లో అందరూ అనుకున్నవన్నీ జరిగి ప్రతి రోజూ సంతోషంగా గడపాలని..కల్మషము ఎరుగని ఈ పిల్లల జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకలు ఈ పిల్లల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.
పది మందిని సంతోష పెట్టి నప్పుడే మనస్సుకు తృప్తి అని వెల్లడించారు. పిల్లలు పాటలు పాడి డాన్సులు చేసి అలరించారు. తన సహకారం సంస్థ కు ఎప్పటికీ ఉంటుందని, ‘‘అందరిని గౌరవిద్దాం, అందరిని ప్రేమిద్దాం, మంచిని, ప్రపంచశాంతిని కోరుకుందాం!’’ అని డాక్టర్ అనితా రెడ్డి సందేశానిచ్చారు. అనంతరం ఫ్రూట్స్, స్వీట్లు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ అనితా రెడ్డి, సుచరిత, వసుధ, తదితరులు పాల్గొన్నారు.