వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ఆత్మకూరు లోని వేణుగోపాల స్వామి దేవాలయాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సందర్శించారు. ఆంగ్ల నూతన సంవత్సరాది 2024 వేడుకలలో పాల్గొనేందుకు సోమవారం ఆత్మకూరు మండల కేంద్రానికి ఆయన వచ్చారు.
ఈ సందర్భంగా రేవూరి, మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య వేణుగోపాల స్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా దేవాలయానికి వచ్చిన ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి కి వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రేవూరికి ఆశీర్వచనాలు అందించి పూలమాల వేసి శాలువా కప్పి సత్కరించారు.