- జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి
- ‘ప్రజాపాలన’కు విశేష స్పందన: కాంగ్రెస్ పార్టీ నాయకులు
వేద న్యూస్, జమ్మికుంట:
ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మెటీ సమ్మిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన జమ్మికుంట పట్టణంలోని బాలికల హై స్కూల్, పెద్దంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ప్రజా పాలన’ కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్రం లో నూతనంగా కొలువు దీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభయ హస్తం గ్యారంటీ లను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రజాపాలన నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రజా పాలన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తోందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై జనం పూర్తి విశ్వాసంతో భారీ సంఖ్యలో పాల్గొని దరఖాస్తులు సమర్పిస్తున్నారని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్నీ ఎన్నుకున్న ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తూ..ఈ ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొనడం అధికారులకు ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని స్పష్టం చేశారు.
దళారులను, ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను..వారు చేసే బూటకపు మాటలను..తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.
పూర్తి పారదర్శకంగా నిర్వహించే ‘‘ప్రజా పాలన’’ కార్యక్రమాన్ని జనం సద్వినియోగం చేసుకోవాలని సమ్మిరెడ్డి కోరారు.
స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రొటోకాల్ గురించి మాట్లాడట దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. కౌశిక్ రెడ్డి అధికారులను బెదిరించడం మానుకోవాలని హితవు పలికారు.
బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న, సుంకరి రమేష్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎండి సలీం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒబిసి సెల్ కోఆర్డినేటర్ చిన్నింటి నాగేంద్ర, కగితం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.