వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు అయోధ్యలోని భవ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ట జరగనుంది. ఈ నేపథ్యంలో రాముల వారి అక్షింతలను అందజేస్తున్నారు.

రాముల వారి క్షేత్రం నుంచి వచ్చిన అక్షింతలను బుధవారం ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో ఇంటింటికీ పంపిణీ చేశారు. బొడ్రాయి వద్ద, గ్రామ హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం గ్రామ నాయకులు గ్రామంలో ఇంటింటా అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కుడితాడి రాజు, సుకినె సుధాకర్, కుడితాడి చిరంజీవి, కరుణాకర్, హింగె నర్సింగం, ఇరువాల శివాజీ, అనంతరావు, హింగె రమేశ్, ఎనకమూరి సారంగం, శ్రీను, గోపి తదితరులు పాల్గొన్నారు.