•  సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయాలి: నాగుర్ల వెంకన్న
  • ఓబీసీ సమస్య పరిష్కారానికి కృషి: సంఘం అధ్యక్షులు శివాజీ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 సంవత్సరం క్యాలెండర్ ను బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని ఆరె సంఘ భవనంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆ సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షులు హింగే శివాజీ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపెల్లి శివాజీ, రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలేరావు మనోహర్ రావు, ఉద్యమ కమిటీ చైర్మన్ సోమిడి అంజన్ రావు, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మోటే చిరంజీవి హాజరయ్యారు.

ఆవిష్కరణ అనంతరం నాగుర్ల వెంకటేశ్వర్లు(వెంకన్న) మాట్లాడుతూ హనుమకొండ జిల్లా కమిటీ క్యాలెండర్ ముద్రించి జిల్లాలోని ప్రతీ ఆరె కుటుంబానికి అందించడం గొప్ప విషయం అని చెప్పారు. అందుకు జిల్లా కమిటీని అభినందిస్తున్నట్లు తెలిపారు. కుల సంఘం పార్టీలకు అతీతంగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధుల తో అవసరమైన పనులు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.

అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి.., ఆరె సంక్షేమ సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయాలన్నారు. అందుకు అవసరమైన నిధుల సేకరణ మార్గాలు అన్వేషించాలని సూచించారు. కుల సంఘం అభివృద్ధికి తాను ఎల్లవేళలా సమయం కేటాయిస్తానని పేర్కొన్నారు.

సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపెల్లి శివాజీ మాట్లాడుతూ క్యాలెండర్ అనేది ఆరె కులస్థులకు ఏకం చేయడానికి ఒక మార్గం అని అన్నారు. అపరిష్కృతంగా ఉన్న ఓబీసీ సమస్య పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

 

ఎన్సీబీసీ కమిషన్ తో ఎంక్వైరీ చేయించి ఆ ఫైల్ ను సోషల్ జస్టిస్ మినిస్టర్ వద్దకు చేరుకొనే విధంగా కృషి చేశామని చెప్పారు. త్వరలో కేంద్ర క్యాబినెట్ లో ఆమోదించి సమస్య పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారని వెల్లడించారు.

కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు కొల్లూరి కండేరావు, పేర్వాల లింగమూర్తి, వాడికారి బాబురావు, కుడ్లే మనోహర్ రావు, లోనే దీపక్ జి, గురుజాల నిరంజన్ రావు, సిందే చందర్ రావు సుకీనె సుధాకర్, హింగే భాస్కర్, అంబీరు శ్రీనివాస్, వాడికారి లక్ష్మణరావు, సిరిసె చందర్ రావు మండల అధ్యక్షులు కధం రాములు, కుడుతాడి రాజు, అడగాని శివాజీ, లోకటి నగేష్, భవన నిర్మాణ కమిటీ సభ్యులు సిందే రామారావు, మోరె ఆగయ్య, హింగే రాజేశ్వర్ రావు, పేర్వారం శంకర్ రావు, విజయలక్మి, బాదరగాని రాకేష్, లడే శ్రీనివాస్, లడే శ్రీకాంత్, దౌత్ బాజి అంజాజి, సదాశివ రావు రాజు తదితరులు పాల్గొన్నారు.