•  వరంగల్ కానిస్టేబుల్‌కు ‘సేవాస్ఫూర్తి’ అవార్డు 
  •  2024 సంవత్సరానికి అందుకున్న స్విమ్మర్ రాజు
  • అవార్డు ప్రదానం చేసిన వీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: 

వీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ డాక్టర్ నవీన్ వల్లం ఆధ్వర్యంలో ఆ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ 11వ వార్షికోత్సవం సందర్భంగా సమాజానికి వివిధ రంగాలలో అత్యున్నతమైన సేవలందిస్తున్న 21మంది సేవమూర్తులకు అవార్డులు ప్రదానం చేశారు

శనివారం ఈ కార్యక్రమం తెలంగాణ సరస్వత్ పరిషత్ తిలక్ రోడ్, హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సేవామూర్తులకు ‘‘సేవాస్ఫూర్తి అవార్డు-2024’’ అవార్డులను అందజేశారు. వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేట గ్రామానికి చెందిన కన్నె కుమారస్వామి-రామనీల దంపతులు పెద్ద కుమారుడు రాజు.

ఆయన బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్ గా ఉంటూనే వరంగల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. కన్నె రాజు అలియాస్ స్విమ్మర్ రాజు గా ఆయన పలువురికి సుపరిచితులు.

గత 19 సంవత్సరలుగా అంటే 2005 వ సంవత్సరం నుండి సామాజిక సేవా కార్యక్రమలు చేపడుతున్నారు. 2009 వ సంవత్సరం నుండి పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ..‘‘ఫ్రెండ్లీ పోలీస్’’ లో భాగంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోన్నారు.

రక్తదానం చేయడం, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, అన్నదాన కార్యక్రమాలు, అవయవదానం, ప్లాస్మాదానం, నేత్రదానం, గ్రామీణ ప్రాంత విద్య అభివృద్ధి కోసం కృషి చేయడం, స్వచ్ఛ – భారత్ , హరితహారం, వరద బాధితులకు సహాయం చేయడంతో పాటు వివిధ అంశాలపై విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

దాంతో పాటు వృద్ధాశ్రమాలకు, క్రీడాకారులకు , వివిధ అత్యవసరమైన సమయంలో ఉన్నవారికి ఆర్థికంగా సహాయం చేయడం, కరోనా (కోవిడ్ -19 ) విపత్కరమైన సమయంలో కరోనా బాధితులకు ప్లాస్మాదానం, నిత్యవసర వస్తువుల అందజేత, మెడిసిన్స్, మాస్కులు అందజేస్తున్నరాు. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు తాను చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి అవార్డు ఇచ్చిన వీయన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కు రాజు థాంక్స్ చెప్పారు.

ఆ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ డాక్టర్ నవీన్ వల్లం, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ , విశ్రాంతి డీసీపీ సుంకర సత్యనారాయణ చేతుల మీదుగా ‘‘సేవాస్ఫూర్తి అవార్డు – 2024’’ను కన్నె రాజు అందుకున్నారు.

ఈ అవార్డు రావడానికి, తాను ఈ విధంగా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడానికి.. తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న తన ఉపాధ్యాయులకు, వరంగల్ పోలీస్ డిపార్ట్ మెంట్ అధికారులకు, యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ సభ్యులకు, రాగంపేట గ్రామ ప్రజలకు, ఖానాపురం మండల ప్రజానీకానికి, పాత్రికేయులకు, రక్తదాతలకు..మిత్రులందరికీ కన్నెరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.