• భక్తులకు అన్నదానం

వేద న్యూస్, ఆసిఫాబాద్:
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ అమ్మవారికి ఆలయంలో భక్తులు ఆదివారం మొక్కులు సమర్పించుకున్నారు.

అమ్మ వారిని దర్శించుకున్న అనంతరం భక్తులు వొడి బియ్యలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలను నెరవేర్చే శక్తిమంతురాలు అమ్మవారు అని పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు.

 

పూజ అనంతరం వచ్చిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు దేవర వినోద్ అన్నదానం చేశారు. స్వయంగా ఆయనే అన్నం, కూరలు భక్తులకు వడ్డించారు.