• రాష్ట్రవ్యాప్తంగా ఆరె విద్యావంతుల వేదికను నిర్మించాలి
  • రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
హనుమకొండ లోని ఇందిరానగర్ లో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు(వెంకన్న) నిలయంలో ఆరె కుల విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు మోటె చిరంజీవి ఆధ్వర్యంలో ఆదివారం ఆరెకుల విద్యావంతుల వేదిక ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆరె కుల విద్యావంతుల వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నాగూర్ల వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు.

ఆరెకుల విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాల నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆరె కుల విద్యావంతుల వేదికను నిర్మాణం చేయాలని సూచించారు.

 

ఆరె కుల విద్యార్థినీ విద్యార్థులకు ఓబిసి సర్టిఫికెట్ లేనందున ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికేట్ ను ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఉపయోగించుకోవాలని చెప్పారు. మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతీ గ్రామంలో విస్తరించేందుకు విద్యావంతులు ఎంతగానో కృషి చేయాలన్నారు.

వారికి ఎలాంటి సహాయ సహకారాలు అయినా తాను అందిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఆరెకుల విద్యావంతుల వేదిక రాష్ట్ర సలహాదారు పేర్వాల లింగమూర్తి, ఆస్నాల శ్రీనివాస్, మేకిరి దామోదర్, మారిజోడు నరసింహారావు, నాయకులు బాబురావు, అశోక్, శ్రీనివాస్, డాక్టర్ సంజీవ్, నాగరాజు, యుగంధర్, తిరుమల్, భాస్కర్, రాజు తదితరులు పాల్గొన్నారు.