•  వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
పాలకుర్తి ఝాన్సీ సేవలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అవసరమని వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. సోమవారం పాలకుర్తిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమి పూజ కార్యక్రమం ఝాన్సీ రాజేందర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

ఎమ్మెల్యే లు నాగరాజు , రామచంద్రునాయక్, రాజగోపాల్ రెడ్డి, మురళి నాయక్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్ రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలకుర్తి ఝాన్సీ రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమి పూజ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమని చెప్పారు.

ట్రస్టు ద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా పాలన అద్భుతంగా చేస్తున్నారని, రాబోయే రోజులలో ప్రతి పేదవారికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజయ్య, డాక్టర్ అనిల్, దొమ్మటి సాంబయ్య, ప్రభాకర్ అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.