• నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
  • రాబోయే వానాకాలం పంట నాటికి తూముల మరమ్మతు చేయిస్తాం
  • కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి: దొంతి 

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట:
పాకాల చెరువు కింద రబీ పంటలకు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు.

సోమవారం యాసింగి పంటకు నీరు అందించేందుకు పాకాల చెరువు తూములను లేపి నీటి విడుదల చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని.. కట్టపై ఉన్న హనుమాన్ కట్ట మైసమ్మలకు పూజలు నిర్వహించారు. అనంతరం తూముల ద్వారా నీరు విడుదల చేశారు.

ఈ సందర్భంగా దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తూముల నుండి నీరు లీకేజీ ద్వారా పోతున్న మరమ్మతులు జరగలేదని చెప్పారు. రాబోయే ఖరీఫ్ నాటికి తూములను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి.. నీటినిలువకు కృషి చేస్తానని ప్రకటించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.