- సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి
వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి:
పశు మిత్రలకు కనీస వేతనం చెల్లించాలని పశు మిత్ర వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పశు మిత్రల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా పశు మిత్ర వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శులు నాగమణి, లావణ్య లు మాట్లాడుతూ, ఐకేపీ ద్వారా గత ప్రభుత్వం తమకు ట్రేనింగ్ ఇచ్చిందని, గత 8 సంవత్సరాలుగా తాము గ్రామాల్లో రైతులకు ఉన్న పశువులు అనారోగ్య బారిన పడితే వైద్యం అందించాము కానీ ప్రభుత్వం మాత్రం తమకు ఎలాంటి వేతనాలు ఇవ్వలేదని అన్నారు.
ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అలోచించి తమకు న్యాయం చేయాలని కోరారు. తమకు కనీస వేతనాలు, పీఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, పశుమిత్రల సమస్యలు పరిష్కరించడంలో గత రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పశుమిత్రల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పశు మిత్ర వర్కర్స్ యూనియన్ సభ్యులు సరోజ, శ్యామల, సరిత, రమ్య, శైలజ, శారద, స్వప్న, జ్యోతి, రజిత తదితరులు పాల్గొన్నారు.