వేద న్యూస్, మరిపెడ:
జన విజ్ఞాన వేదిక ప్రతీ సంవత్సరం ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిర్వహించే ‘చెకుముకి’ పరీక్ష వాల్ పోస్టర్‌ను బుధవారం మరిపెడ మండల ఎమ్మార్వో సైదులు, ఎంపీడీవో ధన్ సింగ్ సీతారాంపురం ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులలో పరిశీలన, ప్రశ్న, అధ్యయన, హేతుబద్ధ ఆలోచనలు, పరిశోధనా శక్తి, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవడానికి చెకుముకి పరీక్ష నిర్వహించడం హర్షణీయమని చెప్పారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మరిపెడ మండల అధ్యక్షులు బయగాని రామ్మోహన్ మాట్లాడుతూ మండలంలోని ప్రతీ పాఠశాలలో 8, 9, 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.

పాఠశాల స్థాయిలో 19 జనవరి, మండల స్థాయిలో 27 జనవరి, జిల్లా స్థాయిలో 3 ఫిబ్రవరిన రాష్ట్రస్థాయిలో ఫిబ్రవరి 9, 11 తేదీలలో ఈ పోటీ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు రామచంద్రు, జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి లింగంపల్లి దయానంద్, మరిపెడ జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు బయగాని రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, చెకుముకి జిల్లా కన్వీనర్ ప్రవీణ్, జీవశాస్త్ర ఆర్పి సునీత, అసిస్టెంట్ ప్రొఫెసర్ టి. వెంకన్న, మండల చెకుముకి కన్వీనర్ సుభాన్, జనవిజ్ఞాన వేదిక బాధ్యులు డాక్టర్ రాజు, రామచంద్రయ్య, వెంకన్న, సుధాకర్, సునీల్ కుమార్, వెంకటేశ్వర్లు, శ్రీశైలం, హరి, సైన్స్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.