వేద న్యూస్, ఎంజీఎం:
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో ఔట్సోర్సింగ్ కార్మికురాలుగా విధులు నిర్వహిస్తున్న రాజమ్మ నర్సుల పట్ల అసభ్యంగా మాట్లాడుతుందని ఎంజీఎం ఆసుపత్రి ముందు స్టాఫ్ నర్సులు గురువారం ఆందోళన కు దిగారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి స్టాఫ్ నర్సులను ఔట్సోర్సింగ్ కార్మికురాలు అసభ్యంగా దూషిస్తుందని ఎంజీఎం సూపరింటెండెంట్, ఆర్ఎంవోలకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని స్టాఫ్ నర్సులు ఆరోపించారు.
రాజమ్మ ప్రవర్తన పట్ల తాము విధులు నిర్వహించలేకపోతున్నామని తక్షణమే రాజమ్మను ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కేవలం ఎంజీఎం హాస్పిటల్ కాకుండా వరంగల్ నగరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోని స్టాఫ్ నర్సులందరూ ఆందోళన చేస్తారని హెచ్చరించారు. రాజమ్మ ప్రవర్తన పట్ల కలెక్టర్ స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆమెపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటం కొనసాగిస్తామని స్టాఫ్ నర్సులు ఈ సందర్భంగా తెలిపారు.