వేద న్యూస్, కరీంనగర్:
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు..కోడి పందేలు ఉంటాయన్న విషయం అందరికీ విదితమే. ఆ పందాల కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు కూడా. కాగా, ఈ పందెం కోళ్లకు సంబంధించిన ఆసక్తికర ఘటన ఒకటి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓ పందెం కోడికి, ఆర్టీసీకి ఉన్న సంబంధం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆ ఘటన వివరాల్లోకెళితే..ఈ నెల 9న ఎవరో ఒక ప్యాసింజర్ ‘‘పందెం కోడి’’ని బస్సులో మరిచిపోయారు. అది తిరిగి తీసుకుపోవడానికి ఎవరూ రాలేదు. దాంతో ఆ కోడిని అంబేద్కర్ బస్ స్టేషన్ ఆవరణలో కరీంనగర్ -2 డిపో పరిధిలో బహిరంగం వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ మేరకు లిఖిత పూర్వక ప్రకటన సోషల్ మీడియాలో వైరలవుతోంది. సదరు లేఖ ప్రకారం ఈ నెల 12న మధ్యాహ్నం 3 గంటలకు ‘‘పందెం కోడి’’ బహిరంగ వేలం ఉంటుందని కరీంనగర్-2 డిపో మేనేజర్ పేర్కొన్నారు. ఆర్టీసీ అధికారులు ఇచ్చిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.