- అటవీ, పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
వేద న్యూస్, హైదరాబాద్ :
భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అని అటవీ, పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.పచ్చదనం పెంపుకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో, నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను మన పరిసరాలు, గాలి, నీరు కలుషితం అవుతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు, ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపును విధిగా చేపట్టాలని పిలుపునిచ్చారు.
తన సెక్రటేరియట్ కార్యాలయంతో పాటు, నివాసంలోనూ వీలైనంతగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించేందుకు నిర్ణయించామన్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ బదులుగా గ్లాస్ బాటిల్స్ లేదంటే స్టీల్ వస్తువుల వాడకాన్ని పెంచాలని సూచించారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ ఒక వీడియో, ఫొటో సందేశాన్ని విడుదల చేశారు.