వేద న్యూస్, జమ్మికుంట:
హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి వొడితల ప్రణవ్..జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బుడిగే శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రణవ్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ సరికొత్త విజయాలను ఇవ్వాలని, ప్రజలంతా సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఇటీవల నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వ ప్రతినిధిగా తాను సైతం హుజురాబాద్ నియోజకవర్గాన్ని మునుపెన్నడూ జరిగిన విధంగా అభివృద్ధి చేసేందుకు విరామం లేకుండా కృషి చేస్తానని హామీనిచ్చారు.

కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు అన్నం ప్రవీణ్, బిజిగిరీ శ్రీకాంత్, కారింగుల రాజేందర్, బుడిగే శ్రీకాంత్, యేబూషి అజయ్, ఇటుకాల గణేష్, పచ్చిమట్ల భాను, కాసార్ల దిలీప్, జియా, కార్తీక్, పూరెల్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.