• మొక్కలు తీసుకోవడానికి భారీగా తరలివచ్చిన భక్తులు
  • గత 7 సంవత్సరాలుగా మొక్కలు పంపిణీ చేస్తోన్న జేఎస్ఆర్

వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి:
హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో ప్రసిద్ధి గాంచిన కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్వామి వారిని దర్శించుకున్నారు.

అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వృక్షప్రసాద దాత జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి(జేఎస్ఆర్) ఏర్పాటు చేసిన ‘‘వృక్ష ప్రసాద’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు ఈటల రాజేందర్, జేఎస్ఆర్ తో కలిసి మొక్కలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కొత్తకొండ ప్రాంత ప్రజానికం భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ రోజు దర్శనం చేసుకోవడానికి వేలాది మంది రావడం కోరిన కోర్కెలు నెరవేరతాయని ప్రగాఢ నమ్మకం ప్రజలది అని చెప్పారు.

కొత్తకొండ లో గత 7 సంవత్సరాలుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వృక్ష ప్రసాద దాత జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి (జేఎస్ఆర్) బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాది మొక్కలు పంపిణీ చేయడం హర్షించ దగ్గ విషయం అని తెలిపారు. ఈ ప్రాంతం కరువు ప్రాంతం కాబట్టి వర్షాలు సంవృద్ధి గా కురిసి..ప్రజలందరూ పాడి పంటలతో సంతోషంగా వుండాలానే ఉద్దేశంతో పంపిణీ చేయడం సంతోషించ దగ్గ విషయం అని కొనియాడారు. ఈ ప్రాంత ప్రజల కల అయిన కొత్త కొండ మండలాన్ని చేయాలని కోరారు.