వేద న్యూస్, ఎల్కతుర్తి:
రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మంగళవారం తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి రావుతో కలిసి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగె భాస్కర్, సమితి రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి తుమ్మలను హైదరాబాద్ లో ఆయన చాంబర్ లో కలిసిన రైతు రక్షణ సమితి నాయకులు.. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మంత్రికి వివరించారు.

“రైతుబంధు” తో పాటు వివిధ విషయాలను వ్యవసాయ శాఖ అమాత్యులు తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు. రైతు రక్షణ సమితి నాయకులు ప్రస్తావించిన అంశాల పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటుందని, రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నట్లు రైతు రక్షణ సమితి నాయకులు తెలిపారు. కార్యక్రమంలో రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి రావు, ఆ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్, వివిధ జిల్లాల అధ్యక్షులు రాఘవేంద్ర రెడ్డి, యాదవ్ గౌడ్ ,రామలింగారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.