• శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు
  •  వీరభద్రస్వామి నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం

వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి:
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా బుధవారం వీరభద్ర సమేత భద్రకాళి త్రిశూల స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు.వేద మంత్రాలు,వీరభద్ర స్వామి నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

వీరభద్రస్వామి ఆవాహనతో వీరముచ్చు వంశస్థులు డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలతో వారు చేసిన విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా ఆలయ పూజారి వినయ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ త్రిశూలేశ్వరుని సహితంగా పుష్కరిణిలో భక్తులు పవిత్ర స్నానమాచరిస్తే శత్రుపీడ, శరీరపీడ, రోగ బాధలు తొలగిపోతాయని తెలిపారు.

ఆలయ ఈవో కిషన్ రావు మాట్లాడుతూ భక్తుల కోలాహలం మధ్య త్రిశూల స్నానం నిర్వహించామని,ఈ వేడుకకు అశేషంగా భక్తులు హాజరై స్వామీ వారి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పారు.కార్యక్రమాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.